‘వైయస్‌ఆర్‌ కాపు నేస్తం’ ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి లాప్‌టాప్‌ బటన్‌ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,35,873 మంది 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల పేద కాపు అక్కచెల్లెమ్మలకు రూ.15 వేల ఆర్థికసాయాన్ని నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలోకి సీఎం వైయస్‌ జగన్‌ జమ చేశారు. పథకం ప్రారంభోత్సవానికి ముందు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లబ్ధిదారులతో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 13 నెలల కాలంలో కాపుల సామాజికవర్గానికి చెందిన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు వివిధ పథకాల ద్వారా కాపు నేస్తం సహా అక్షరాల రూ. 4,770 కోట్లతో లబ్ధి చేకూర్చామన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top