‘వలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైయ‌స్‌ జగన్‌

విజ‌య‌వాడ‌: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరి విజయవాడ ఏ ప్లస్‌ కన్వె­న్షన్‌ సెంటర్‌కు చేరుకున్నారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించిన అనంత‌రం.. వ‌రుస‌గా మూడో ఏడాది ‘వలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. మ‌రికాసేప‌ట్లో వ‌లంటీర్లును ఉద్దేశించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు. ఉత్తమ వలంటీర్లకు అవార్డులు ప్రదానంతో పాటు సత్కరించనున్నారు. వలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలు అందజేయనున్నారు.

Back to Top