‘జగనన్న చేదోడు’ ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా షాపులున్న దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణుల కుటుంబాలకు సాయం అందిస్తూ ‘జగనన్న చేదోడు’ పథకానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌లు, లబ్ధిదారులతో మాట్లాడిన అనంతరం లాప్‌టాప్‌ బటన్‌ నొక్కి ‘జగనన్న చేదోడు’ పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. 

ఈ పథకం ద్వారా షాపులున్న 1,25,926 మంది టైలర్ల కుటుంబాలకు, షాపులున్న 82,347 మంది రజక సోదరుల కుటుంబాలకు, షాపులున్న దాదాపు 40 వేల నాయీ బ్రాహ్మణ అన్నదమ్ముల కుటుంబాలకు మేలు చేకూరింది. మొత్తం 2,47,040 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున రూ.247.04 కోట్లను నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలోకి జమ చేశారు. 
 

Back to Top