ఏపీ ఎస్టీ కమిషన్‌ యాప్‌ను ఆవిష్క‌రించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వార్షిక నివేదిక అంద‌జేసిన ఎస్టీ క‌మిష‌న్ చైర్మ‌న్‌

తాడేప‌ల్లి:  గిరిజనుల అభ్యున్నతి, వారి సమస్యల పరిష్కారం కోసం దేశంలో తొలిసారిగా ఏపీ ఎస్టీ కమిషన్‌ యాప్‌ను   రాష్ట్ర షెడ్యూల్డ్‌ తెగల కమిషన్ రూపొందించింది. ఈ యాప్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్క‌రించారు. అలాగే ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వార్షిక నివేదికను ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌, సభ్యులు అంద‌జేశారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కుంభా రవిబాబు, కమిషన్‌ సభ్యులు వడిత్యా సోమశంకర్‌ నాయక్, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, కొర్ర రాము, చిచ్చడి మురళీ, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ మురళీ, ఎస్టీ  కమిషన్‌ సెక్రటరీ డాక్టర్‌ గంగాధర్ త‌దిత‌రులు క‌లిశారు. 
కమిషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన బ్రోచర్‌ను, ఎస్టీ కమిషన్‌కు సంబంధించిన ఏపీఎస్టీసీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను, ఏపీ ఎస్టీ కమిషన్‌ యాప్‌ను కూడా సీఎం వైయస్‌.జగన్ ఆవిష్క‌రించారు. 
 

Back to Top