కాసేపట్లో ‘వైయస్‌ఆర్‌ వాహన మిత్ర’ ప్రారంభం

తాడేపల్లి: కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ముందడుగులు వేస్తున్నారు. వరుసగా మూడో ఏడాది వైయస్‌ఆర్‌ వాహనమిత్ర పథకాన్ని నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్‌ జగన్‌ కాసేపట్లో ప్రారంభించనున్నారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ కాబ్‌ డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్, రిపేర్లు, ఇంకా ఇతర అవసరాల కోసం వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ద్వారా సీఎం వైయస్‌ జగన్‌ సాయం అందిస్తున్నారు. వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ద్వారా ఈ ఏడాది 2.48 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లకే రూ.10 వేలు చొప్పున జమ చేయనున్నారు. ఇందుకు రూ.248.47 కోట్ల నగదును రాష్ట్ర ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తోంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది కొత్తగా 42,932 మందికి వైయస్‌ఆర్‌ వాహన మిత్ర సాయం అందనుంది.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top