కొత్త జిల్లాలను వర్చువల్‌గా ప్రారంభించిన‌ సీఎం వైయ‌స్‌ జగన్‌

 ఆంధ్రప్రదేశ్‌లో 42 ఏళ్ల తర్వాత.. కొత్త జిల్లాల ఏర్పాటు

ఉద్యోగుల‌కు, ప్ర‌జ‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్‌ కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా.. 13 జిల్లాలు కాస్త 26గా మార్పు చేస్తూ సోమ‌వారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ కొత్త జిల్లాల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఇకపై ఏపీ రాష్ట్రంలో 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఉంటాయ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చెప్పారు. ఈ రోజు నుంచే కొత్త కార్యాల‌యాల ద్వారా సేవ‌లందిస్తార‌ని, అంద‌రు ఉద్యోగులంద‌రూ కొత్త కార్యాల‌యాల  నుంచే కార్య‌క‌లాపాలు ప్రారంభిస్తార‌ని, జిల్లాల ప్ర‌జ‌ల‌కు, ఉద్యోగుల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు తెలిపారు. 

తాజా వీడియోలు

Back to Top