న‌ర్సీప‌ట్నం మెడిక‌ల్ కాలేజీ నిర్మాణ ప‌నుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శంకుస్థాప‌న‌

తాండవ–ఏలేరు ఎత్తి­పో­తల పథ­కం కాలువల అనుసంధాన ప్రాజెక్టుకు శంకు­స్థాపన  

అన‌కాప‌ల్లి జిల్లా:   నర్సీ­పట్నం వైద్య కళాశాలకు సీఎం వైయ‌స్‌ జగన్‌­మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే తాండవ–ఏలేరు ఎత్తి­పో­తల పథ­కం కాలువల అనుసంధాన ప్రాజెక్టుకు శంకు­స్థాపన చేశారు. అన­కా­పల్లి జిల్లా మాక­వారి­­పాలెం మండలం భీమ­బో­యినపాలెంలో 52.15 ఎక­రాల్లో ఈ వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో బోధనాస్పత్రి, వైద్య, నర్సింగ్‌ కళాశా­లలు, వైద్య విద్యార్థుల హాస్టళ్లు, ఇతర నిర్మాణాలను అత్యా­ధునిక వసతు­లతో చేపట్టను­న్నారు. ఏలేరు, తాండవ ప్రాజెక్టుల అనుసంధానానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. రూ.470.05 కోట్లతో చేపట్టిన ఈ అను­సం­ధానం పను­లకు శంకుస్థాపన చేశారు. ఏలేరు ఎడమ కాలువను తాండవ కాలు­వతో అనుసంధానం చేయ­డం ద్వారా కొత్తగా 5,600 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు తాండవ ప్రాజెక్టు కింద 51,465 ఎకరా­లను స్థిరీకరించనున్నారు.

వెను­కబడిన ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసేందుకు మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జల­యజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయా­లన్న లక్ష్యంతో  సీఎం వైయ‌స్‌ జగన్‌.. గోదావరి జలాలను 8 లక్షల ఎక­రాలకు నీళ్లందించేలా రూ.17,411.40 కోట్లతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. తాజాగా.. ఏలేరు–­తాండవ అనుసంధానం చేప­ట్టడం ద్వారా ఉత్తరాంధ్రలో సాగునీటి సదుపాయాలను మరింత మెరుగు­పర్చి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయ­డంలో  సీఎం మరో అడుగు ముందుకేశా­రని రైతులు, నీటిపారు­దలరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు.

Back to Top