కోవిడ్‌ నివారణ చర్యలపై సీఎం కీలక సమీక్ష

తాడేపల్లి: కోవిడ్‌ నివారణ, నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ఆస్పత్రుల్లో సమస్యల పరిష్కారం, మందులు, ఆక్సిజన్‌ సరఫరా, కర్ఫ్యూ పొడిగింపు వంటి అంశాలపై సీఎం వైయస్‌ జగన్‌ చర్చించనున్నారు. ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. 
 

Back to Top