శాశ్వత భూహక్కు - భూరక్ష పథకంపై సీఎం స‌మీక్ష‌

అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్ ని పరిశీలించిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేప‌ల్లి: వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకంపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌రిశీలించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం,  సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్ జి. సాయి ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, రెవెన్యూశాఖ కమిషనర్‌ సిద్దార్ధ జైన్‌ ఇతర ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top