జేఎన్‌టీయూ కాలేజీకి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శంకుస్థాప‌న‌

తాడేప‌ల్లి: న‌ర‌స‌రావుపేట‌లోని జెఎన్‌టీయూ కాలేజీకి వ‌ర్చువ‌ల్ విధానంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శంకుస్థాప‌న చేశారు. తాడేప‌ల్లి లోని క్యాంపు కార్యాల‌యం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు. జేఎన్‌టీయూ కాలేజీలో7 2016లో ఫ‌స్ట్ బ్యాచ్ పిల్ల‌ల‌ను తీసుకున్నారు. అప్పుడుచేరిన పిల్ల‌లు ఇప్పుడు ఫైన‌ల్ ఇయ‌ర్‌కు వ‌చ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు కాలేజీ క‌ట్టాల‌న్న ఆలోచ‌న గ‌త ప్ర‌భుత్వం చేయ‌లేద‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.  ఇటీవ‌ల ప్ర‌భుత్వం 1100 పోస్టులు భ‌ర్తీ చేసింద‌ని, ఇందులో కొన్ని పోస్టులు జేఎన్‌టీయూ కాలేజీకి కేటాయించిన‌ట్లు సీఎం పేర్కొన్నారు. కాలేజీకి సంబంధించిన భ‌వ‌నాల నిర్మాణాలు, ఇత‌ర అంశాల‌న్నీ కూడా ప్ర‌భుత్వం త‌ర‌ఫున మంజూరు చేసి విద్యార్థుల అభ్యున్న‌తికి తోడుగాఉంటాన‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో ఎంపీ లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు, ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని, గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి, అంబ‌టి రాంబాబు, కాసు మ‌హేష్‌రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top