రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: రైతు సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు, ఉన్నతాధికారులు, రైతులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10,641 రైతు భరోసా కేంద్రాలను క్యాంపు కార్యాలయం నుంచి లాప్‌టాప్‌ బటన్‌ నొక్కి సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టి నేటితో సంవత్సరాలం పూర్తయిన రోజు రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించినందుకు ఆంధ్రరాష్ట్ర రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. 

Back to Top