బాపు మ్యూజియాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

విజయవాడ: దశాబ్దకాలంగా మూతపడి ఉన్న బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. పదేళ్లుగా మూతపడి ఉన్న మ్యూజియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రూ.8 కోట్ల వ్యయంతో పునర్‌నిర్మించారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మ్యూజియాన్ని సిద్ధం చేసింది. బాపు మ్యూజియాన్ని ప్రారంభించిన అనంతరం పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. విక్టోరియా మహల్‌లోని బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ నాయకుల విగ్రహాలను పరిశీలించారు. మ్యూజియంలోని చారిత్రక, పురాతన వస్తువులను పరిశీలించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వెంట మంత్రులు అవంతి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top