ఆల్‌ ది వెరీ బెస్ట్..

ప్రజాశక్తి కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం వైయ‌స్ జగన్‌
 

అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రజాశక్తి భవనాన్ని సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో శుక్రవారం రోజున సీఎం కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ప్రజాశక్తి దినపత్రిక కార్యాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాశక్తి దినపత్రిక యాజమాన్యం, సిబ్బందికి సీఎం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆల్‌ ది వెరీ బెస్ట్‌ చెప్పి అభినందించారు. కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్‌) జీవీడీ కృష్ణమోహన్‌, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. మధుతో పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top