నూత‌న ఆస్ప‌త్రిని ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: నూత‌న ఆస్ప‌త్రి ద్వారా ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రగాల‌ని కోరుకుంటున్నాన‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో ఉద‌యానంద ఆస్ప‌త్రిని తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిట‌ల్ డైరెక్ట‌ర్‌ల‌తో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని ఆదేశించారు. కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హాస్పిటల్‌ డైరెక్టర్‌ స్వప్నారెడ్డి  పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top