హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. ఇటీవల కాలి తుంటి శస్త్ర చికిత్స చేసుకున్న మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం వైయస్ జగన్ పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లిన సీఎం వైయస్ జగన్‌కు కేటీఆర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.