మాన‌వ‌త్వ‌మే మతం

స్పందించే గుండె.. మ‌న‌సే బంగారం

పేద జ‌నానికి భ‌రోసా.. జ‌న‌మంద‌రికీ ధైర్యం జ‌గ‌న‌న్న‌

విలువ‌లు.. విశ్వ‌స‌నీయ‌తే ముంద‌డుగులు

రాజకీయాలంటే కరకుగుండెల బాపతు జనాలకు సంబంధించినవి అని ప్రజల్లో బాగా నాటుకుపోయింది. అలాంటి అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ.. రాజకీయాల్లో మానవీయకోణానికి ప్రతినిధిగా పాలన సాగిస్తున్నారు సీఎం వైయస్‌ జగన్‌. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ఈ ఏడాదికాలంగా ‘పాలన’లో మానవత్వం ఛాయలు ప్రస్ఫుటంగా కనిపించేలా చేస్తున్నారు సీఎం వైయస్‌ జగన్‌. తమ దగ్గరకు వచ్చే ప్రజలను చిరునవ్వుతో పలకరించండి.. అని అధికారులకు చెప్పడంలోనే ఆయనలోని మానవీయకోణం కనిపిస్తోంది. 

భవిష్యత్తుపై అపార నమ్మకాన్ని కలిగిస్తోంది
మొండిపట్టుదల ఉన్నవాడు. అనుకున్నది సాధించే లక్ష్యం ఉన్నవాడు. ఎంత కష్టానికైనా.. ఎన్ని నష్టాలనైనా తట్టుకోగలిగే నైజం. ఇవన్నీ వ్యక్తిని శక్తిగా మార్చేవి. వీటికి మానవత్వం తోడయితే ఆ వ్యక్తి శక్తి సమాజానికి ఓ వెలుగు అవుతుంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏడాది పాలన.. భవిష్యత్తుపై అపార నమ్మకాన్ని కలిగిస్తోంది అంటున్నారు కోట్ల తెలుగు జనం. 

ప్రతి అడుగు స్వాగతించదగ్గదే..
నడుస్తున్న రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ జగన్‌ ఓ ఫినామినా. ‘ఎంతకాలం బతికామన్నది కాదు – ఎలా బతికామన్నది ముఖ్యం’ అన్నమాటను వంటపట్టించుకున్న మనిషి ఆయన. అధికార కాలాన్ని వూరికినే కరిగిపోనివ్వడు. ఓ ముఖ్యమంత్రిగా తాను సాధించేవి, రాబోయే కాలంలో గొప్ప పనులుగా స్థిరపడిపోవాలన్నది ఆయన సంకల్పం. ప్రజల ప్రయోజనాలతో ముడిపడ్డ సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో ప్రతి అడుగు స్వాగతించదగ్గదే. 

ప్రజాసేవకులం
‘మీ దగ్గరకు సమస్యలతో వచ్చే ప్రజల్ని ప్రేమతో పలకరించండి. చిరునవ్వుతో పలకరించండి’. ఇవి తన అధికారగణానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పదే పదే చెబుతున్న మాట. ‘అధికారదర్పం ప్రదర్శన కన్నా.. అందరం ప్రజాసేవకులం’ అనుకోవడమే మన ధర్మమంటున్నారు. ఈ మనస్తత్వమే ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి నలుగురు మెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 

‘స్పందన’తో సమస్యల పరిష్కారం
‘స్పందన’ కార్యక్రమం లక్షలాది జనం సమస్యలకు ఓ పరిష్కార వేదికగా నిల్చింది.
ఆ ఒక్కటే కాదు.. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగ వ్యవస్థ ద్వారా ప్రజల దగ్గరకే పాలనను తీసుకెళ్లగలిగారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చేయగలుగుతున్నారు. ఇంతకాలం ప్రభుత్వ కార్యాలయాల్లో తమ పనులు చేసుకోవడానికి అష్టకష్టాలు పడ్డ ప్రజలకిప్పుడు ఆ ఆయాసం తగ్గింది. అవ్వాతాతలు, దివ్యాంగుల కష్టం తీరింది. తమ మొర ఆలకించే మనుషులు కనిపిస్తున్నారు. తమ సమస్యలు పట్టించుకునే ప్రభుత్వ ప్రతినిధులు కనిపిస్తున్నారు. జగన్‌ పాలనలోని ఈ పనితనం సామాన్యులకు సంతోషం.

నేనున్నానని భరోసా
ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందనే మనిషి వ్యక్తిత్వాన్ని పట్టించితీరుతుందంటారు. ఆ విషయంలో సమకాలీన రాజకీయ నాయకులకు ఆమడదూరంలో కనిపిస్తారు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అధికారంలో లేని రోజుల్లోనూ కష్టాల్లో ఉన్న ప్రజల చెంతకు ఆయన చేరుకునేవారు. వారికి నేనున్నానని భరోసా ఇచ్చేవారు. వారి తరఫున పోరాటానికి సిద్ధమయ్యేవారు. ప్రతిపక్షనేతగా ప్రజా సమస్యలపై ఆయన స్పందన.. అప్పటి అధికారానికి వణుకుపుట్టించిన సందర్భాలెన్నో ఉన్నాయి. కేవలం రాజకీయాల కోసం రాజకీయాలు చేయకుండా.. ప్రజా సమస్యల విషయంలో సహేతుకంగా స్పందించడం వైయస్‌ జగన్‌కు మాత్రమే సాధ్యం. 

ఆ రైతు కుటుంబాలకు సాయం
అధికారంలోకి రాగానే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల విషయంలో ఆయన స్పందించిన తీరు సాదాసీదా రాజకీయాలకు ఓ పట్టాన అర్థం కాని విషయమే. ‘చెప్పేదొకటి.. చేసేదొకటి’ తరహా రాజకీయాలకు స్వస్తి చెప్పి.. ఆ బాధిత రైతు కుటుంబాలకు కలెక్టర్ల ద్వారానే సాయం అందేలా చూశారు. అరకొర పరిహారంతో సరిపెట్టక ఏడు లక్షల రూపాయలందించారు. అప్పుల వాళ్ల బెడద ఉండకుండా చూశారు. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. నేనున్నానని గట్టిగా చెబుతూ వస్తున్నారు. 

మానవతా దృక్పథంతో పథకాలు
అటు పల్లెల రూపురేఖలు మారుస్తూ.. ఇటు వ్యవసాయం కష్టాలు తీరుస్తూ.. అన్నదాతలకు అభయహస్తం అందించాలన్న ముఖ్యమంత్రి తాపత్రయం అడుగడుగునా కనిపిస్తోంది. రైతుల సమస్యల విషయంలో రాజకీయ కోణంలో ఆలోచించడం పక్కనపెట్టి.. మానవతా దృక్పథంతో పథకాలు తెచ్చారు ఏపీ సీఎం. అవన్నీ రాబోయే రోజుల్లో వ్యవసాయం దండగ కాదు.. పండుగ అనుకునేలా చేసేవే.. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రజలకందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ పాలకుడిలోని మానవత్వానికి అద్దం పట్టేవే. అందుకు సాక్ష్యం కోట్లాది మంది లబ్ధిదారులు.

ప్రజల కోసం ఎంత కష్టానికైనా సిద్ధం
తన పదవి విలువ తెలిసిన నాయకుడు. కోట్ల మందిలో ఒకరికి దొరికే అరుదైన అవకాశం ముఖ్యమంత్రి పదవి అని వైయస్‌ జగన్‌ అన్న సందర్భాలున్నాయి. ఆ విషయం తెలిసిన మనిషి కాబట్టే తానే కాదు.. తన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారగణం అంతా పాలనలో పొరపాట్లు చేయరాదని పదే పదే చెబుతున్నారు. ప్రజలకు మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని తండ్రి వైయస్‌ఆర్‌కు తెలుసు. తనయుడు వైయస్‌ జగన్‌కు తెలుసు. అందుకే ఆ ఇద్దరూ ప్రజల కోసం ఎంతగా కష్టపడటానికైనా సిద్ధమయ్యారు. 

అండాదండగా
ముఖ్యమంత్రి పదవిని కేవలం అలంకార ప్రాయంగా భావించకుండా, ప్రజలకు మేలు చేయడానికి అందివచ్చిన గొప్ప భాగ్యంగా భావిస్తున్నారు సీఎం వైయస్‌ జగన్‌. ఆ ఆలోచన తీరు వల్లే సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అవసరాలు తీర్చేందుకు పరితపిస్తున్నారు. వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు.. ఎంత కష్టమైనా చేయూత అందించాలని పట్టుదలగా కృషిచేస్తున్నారు. రైతన్నలు, నేతన్నలు, మత్స్యకారులు, గిరిజనం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు, సమస్త వృత్తులవారికీ ప్రభుత్వం అండాదండగా నిలవాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. తను అనుకున్నవి అనుకున్నట్టుగా చేయగలిగితే.. ప్రజల జీవితాల్లో తప్పకుండా మార్పు వస్తుందని, రాష్ట్ర ప్రగతిపథంలో పయనిస్తుందని ఈ ప్రజానేత బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే, తన సంకల్పాన్ని కలనైనా ఏమారనని చెబుతున్నారు. 

దీర్ఘకాలిక ప్రయోజనాలపైనా దృష్టి
స్వల్పకాలిక ప్రయోజనాలే కాదు.. దీర్ఘకాలిక ప్రయోజనాలపైనా దృష్టి ఉన్న నేత వైయస్‌ జగన్‌. ప్రజలకు సత్వరంగా అందాల్సినవి అందాల్సిందే.. అదే సమయంలో రాష్ట్ర భవిష్యత్‌కు ఉపయోగపడే పనులూ జరగాల్సిందే అన్నది యువ ముఖ్యమంత్రి పట్టుదల.. తాను ముఖ్యమంత్రి కాగానే ఏ ఒక్కరోజునూ వృథాగా పోనీకుండా పనిచేసుకుపోతున్నారు. ప్రజా సమస్యల విషయంలో స్పందిస్తున్నారు. దీర్ఘకాలిక రోగుల విషయంలో, సాయం కోసం తనను ఆశ్రయించిన వారి విషయంలో ముఖ్యమంత్రి స్పందించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అందించిన సాయం ఎంతో ఉంది. ఈ సాయం పాదయాత్ర దారిలోనూ సాగింది. ఇప్పుడూ పాలనా మార్గంలోనూ కొనసాగుతోంది. 

ఇవన్నీ సీఎం వైయస్‌ జగన్‌కే సాధ్యం
ఏజెన్సీ ప్రాంతాల్లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్‌ కాలేజీలను సైతం ఏర్పాటు చేయాలని అడుగులేస్తున్న ఈ ముఖ్యమంత్రి, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు అందిస్తున్న మేలు మరింత ప్రత్యేకం. గతంలో లేని జబ్బులను సైతం ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చారు. డయాలసిస్, కేన్సర్‌ రోగులకు కీమోథెరఫీలు, తలసేమియా రోగులకు సాయం వంటివన్నీ వైయస్‌ జగన్‌లా ఆలోచించే వారికే సాధ్యం. నెల నెలా వారికి ఆర్థికసాయం అందేలా చేయడం వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలోని మానవీయకోణానికి నిదర్శనం. 

ఇది వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికే సాధ్యమైంది
పాకిస్తాన్‌లో బందీలైనా, బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయినా, గుజరాత్‌లో ఇరుక్కుపోయినా.. ఆ మత్స్యకార సోదరుల విషయంలో ముఖ్యమంత్రిగా కన్నా.. మానవతావాదిగా సీఎం వైయస్‌ జగన్‌ స్పందించిన తీరు మేధావివర్గాన్ని సైతం కదిలించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఫిలిఫిన్స్‌లో చనిపోయిన ఇద్దరు వైద్య విద్యార్థుల పార్థివదేహాల్ని తీసుకొచ్చారు. అమ్మానాన్నలకు కడసారి చూపుదక్కేలా చేశారు. ఇది వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికే సాధ్యమైంది. 

పాదయాత్ర ప్రజలకు దగ్గర చేసింది
నిజంగా ఈ పాదయాత్ర అనితరసాధ్యుడిని పట్టిచూపేది. ఎండలు మండినా.. హోరుగాలులు వీచినా.. జోరున వర్షం భోరున కురిసినా.. రుతువులు మారిపోతున్నా.. ఆంధ్ర దేశం ఆ మూల నుంచి ఈ మూల దాకా సాగిన ఈ పాదయాత్ర ఓ నాయకుడిని ప్రజలకు ఎంతెంతో దగ్గరగా చేసింది. రాజకీయ నాయకుడంటే ఎలా ఉంటాడో.. అప్పటి దాకా ఉన్న నిర్వచనాలని పటాపంచలు చేసింది. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసానివ్వడానికి నడిచొచ్చిన నాయకుడి మానవీయ కోణాన్ని పట్టిచూపింది. పాదయాత్ర దారిలో ఎన్నెన్నో దృశ్యాలు పేదజనం.. పరుగులు పెట్టే జనం. తమ కష్టాలు చెప్పుకునే జనం.. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ.. వారు చెప్పేవి శ్రద్ధగా వింటూ.. వారికి ధైర్యాన్ని నూరిపోస్తూ.. ఒక మనిషిగా వైయస్‌ జగన్‌ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. 

ఏపీలో ప్రజాపాలనే సాగుతోంది
ఇదిగో ఇలా ప్రేమ మీద పలకరింపు.. స్వంత మనిషిని దగ్గరకు తీసుకున్నట్టుగా.. తీసుకునే జనం.. కులమతాలకతీతమై.. గొప్ప పేద భావాలను దూరమై సాగిన ఈ పాదయాత్ర వైయస్‌ జగన్‌కున్న జనాకర్షణను కళ్లకు కట్టింది. ఆ జనాకర్షణ ఆయనలోని మానవత్వం సాధించిన ఘనత. ఈ పాదయాత్ర చరిత్రను మార్చింది. కొత్త చరిత్రకు నాంది పలికింది. ఆంధ్రప్రదేశ్‌ దశా – దిశా నిర్దేశించింది. అందుకు అనువైన పాలకుడిని ప్రజలకు అందించింది. ఇప్పుడు.. రేపు.. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాపాలనే సాగుతుంది.. మానవత్వం తోడుగా..

తాజా వీడియోలు

Back to Top