కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్‌ను పరిశీలించిన సీఎం వైయస్‌ జగన్‌

నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చూడాలి

మెడికల్ కిట్లు, వసతుల కొరత లేకుండా చర్యలు తీసుకోండి

కరోనా నియంత్రణపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

అమరావతి : కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్‌ను సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పరిశీలించారు. పరీక్షల కోసం ఏపీ ప్రభుత్వం 1000 ర్యాపిడ్‌ కిట్స్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసందే. వాటిని సీఎం పరిశీలించి, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులపై సీఎం వైయస్.జగన్‌ మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాల్లో మెడికల్ కిట్లు, వసతుల కొరత లేకుండా చూడాలన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్‌ పాల్గొన్నారు.

ఒక్కో కిట్‌ ద్వారా రోజుకు 20 టెస్టులు ..
పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో ఈ కిట్స్‌ను తయారు చేశారు. 50 నిమిషాల్లోనే ఒక టెస్టింగ్‌ రిపోర్ట్‌ వస్తుంది. ఒక్కో కిట్‌ ద్వారా రోజుకు 20 టెస్టులు నిర్వహించవచ్చు.

Back to Top