అనంతపురం : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లాలోని ఉరవకొండ పర్యటనలో భాగంగా జూనియర్ కళాశాలలోని హెలిప్యాడ్ వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ వర్గాల ప్రజల నుండి వినతుల్ని స్వీకరిస్తూ వారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించి వారి సమస్యల పరిష్కారంపై తక్షణమే స్పందించారు. వెంటనే ప్రభుత్వం తరపున బాధితులకు సాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమికి ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాత్రి అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 7 మంది బాధితులకు చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు. 1. గుంతకల్లుకు చెందిన టి.రాఘవేంద్ర ప్రమాదంలో శరీరం చచ్చుబడిపోయి కదలిక లేకుండా ఉండడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2 లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ అందజేశారు. 2. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం చిన్నఓబినాయన పల్లి గ్రామానికి చెందిన బాల గురువయ్య బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతుండడంతో 2 లక్షల రూపాయల చెక్కును బాధితుని చెల్లెలు బాలామణికి జిల్లా కలెక్టర్ అందజేశారు. 3. అనంతపురం జిల్లా నార్పల మండలం బి.పప్పూరు గ్రామానికి చెందిన గుర్రం మణికంఠ చిన్నప్పటి నుంచి మస్కులర్ డిస్ట్రఫీ (డిఎండి)తో బాధపడుతుండడంతో 1 లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ అందించారు. 4. గుంతకల్లు పరిధిలోని మోదినాబాద్ కు చెందిన సి.ఆనంద్ Guillan barre syndromతో బాధపడుతుండడంతో మెడికల్ ఎక్సపెన్సెస్ కోసం ఆర్థిక సహాయం అందిస్తూ 5 లక్షల 20 వేల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ అందించారు. 5. ఉరవకొండ మండలం సైషాన్ పల్లి గ్రామానికి చెందిన బి.ధనుష్ రామ్ D/o సురేష్ కళ్ళు లేని పాపకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయంకు సంబంధించిన చెక్ ను జిల్లా కలెక్టర్ అందించారు. 6. అనంతపురం నగరంలోని 6వ రోడ్డుకు చెందిన షేక్ బాబా ఫక్రుద్దీన్ ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ కావడంతో మెడికల్ రీయంబర్స్మెంట్ కింద 2 లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ అందజేశారు. 7. బెలుగుప్ప మండలం అవులన్న గ్రామానికి చెందిన ఉప్పర నరసింహులుకు తలకు గాయమై శాస్త్ర చికిత్స జరగడంతో ఆర్థిక సహాయం కింద 12 లక్షల రూపాయల చెక్కును బాధితులకు జిల్లా కలెక్టర్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకోవాలని బాధితులకు సూచించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ సమస్యను చెప్పుకున్న వెంటనే తమను ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గాయత్రీ దేవి, బాధితులు పాల్గొన్నారు.