పేదల కష్టం తెలిసిన ప్రభుత్వం మనది

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

ఒక్క అర్హుడు నష్టపోకూడదన్నదే మనందరి ప్రభుత్వ లక్ష్యం

అర్హుత ఉండి మిగిలిపోయిన 2,71,065 కుటుంబాలకు రూ.591 కోట్లు విడుదల

డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా 37 నెలల పాలనలో రూ.3.30 లక్షల కోట్లు అందించాం

డీబీటీ ద్వారా రూ.1.85 లక్షల కోట్లు లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమచేశాం

గత పాలకులు జన్మభూమి కమిటీలను పెట్టి ప్రజలను వేధించారు

టీడీపీ హయాంలో ఏ పథకం కావాలన్నా.. జన్మభూమి కమిటీలకు లంచాలు

ఆ పరిస్థితులు మార్చాం.. లంచాలకు, వివక్షకు తావులేని పాలన అందిస్తున్నాం

పెన్షన్లపై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 విషప్రచారం చేస్తున్నాయి

టీడీపీ హయాంలో 39 లక్షల మందికి పెన్షన్‌.. మన హయాంలో 62.70 లక్షల మందికి ఇస్తున్నాం..

గతంలో పెన్షన్‌ బిల్లు రూ.400 కోట్లు.. మన పాలనలో రూ.1770 కోట్లకు చేరింది

తప్పుడు ప్రచారాలను కలెక్టర్లు గట్టిగా తిప్పికొట్టాలి.. 

మనం ఒక పార్టీతో కాదు.. విషపు వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి

తాడేపల్లి: ‘‘అధికారం అన్నది పెత్తనం చలాయించడం కోసం కాదు.. ప్రజలకు సేవ చేసేందుకేనని చెప్పడానికి గొప్ప నిదర్శనంగా ఈరోజు అమలు చేస్తున్న కార్యక్రమం నిలుస్తుంది. మానవత్వంతో పరిపాలన చేస్తున్నాం. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే మన ప్రభుత్వ లక్ష్యం. వ్యవస్థలోకి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఎక్కడా లంచాలకు, వివక్షకు తావులేకుండా పారదర్శకమైన పాలన అందిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అర్హత ఉండి పొరపాటున ఏ కారణం చేతైనా సంక్షేమ సాయం అందనివారికి మరో అవకాశం కల్పిస్తూ ప్రతీ ఆరు నెలలకు (జూన్‌–డిసెంబర్‌) ఒకసారి సంక్షేమ సాయం అందిస్తున్నామని చెప్పారు. జూన్‌ నుంచి నవంబర్‌ వరకు అమలైన 11 సంక్షేమ పథకాలకు సంబంధించి సాయం అందకుండా మిగిలిపోయిన 2,79,065 కుటుంబాలకు మంచి జరిగిస్తూ రూ.591 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి సంక్షేమ సాయాన్ని సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. అంతకు ముందు ప్రజలను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. 

సీఎం వైయస్‌ జగన్‌ పూర్తి ప్రసంగం..
‘‘దేవుడి దయతో మంచి కార్యక్రమం జరుగుతుంది. మనం చేసే ఈ కార్యక్రమం, వేసే ఈ అడుగు మన పాలనకు అద్దం పట్టే విధంగా ఉంది. మనది మనసున్న ప్రభుత్వం, పేదల కష్టం తెలిసిన ప్రభుత్వం, రైతన్నల కష్టం ఎరిగిన ప్రభుత్వం. అందుకే ఏ ఒక్కరికైనా ఏ ఒక్క కారణం చేతైనా అర్హత ప్రకారం వారికి ఏ పథకమైనా అందలేకపోతే ఎవ్వరూ కంగారుపడాల్సిన పనిలేదని భరోసా ఇస్తూ.. పథకం అమలైన నెలరోజులలోపు అప్లికేషన్‌ పెట్టుకోండి అని చెప్పి.. ఆ అప్లికేషన్‌ను రీ వెరిఫై చేసిన తరువాత ఆరు నెలలకు జనవరి నుంచి మే వరకు అమలైన పథకాలు జూన్‌లో, జూన్‌ నుంచి నవంబర్‌ వరకు అమలైన పథకాలు డిసెంబర్‌లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు.. దేశ చరిత్రలో కూడా బహుశా ఇదే ప్రప్రథమం. 

గత ఆరు నెలలుగా జూన్‌ నుంచి నవంబర్‌ వరకు దాదాపు 11 సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ఈ పథకాల్లో పొరపాటున మిస్‌ అయిన 2,79,065 కుటుంబాలకు ఈ రోజు మంచి జరిగిస్తూ రూ.591 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. లంచాలకు ఏమాత్రం తావులేకుండా, వివక్షకు ఎక్కడా చోటు ఇవ్వకుండా ఎంత పారదర్శకంగా పరిపాలన సాగుతోందని చెప్పడానికి చిన్న ఉదాహరణ.. కేవలం మనం ఈ 37 నెలల్లో కేవలం బటన్‌ నొక్కి.. నేరుగా అక్కచెల్లెమ్మలు, ఆ అక్కచెల్లెమ్మల కుటుంబ సభ్యుల బ్యాంక్‌ ఖాతాల్లోకి డీబీటీ ద్వారా పంపించిన సొమ్ము అక్షరాల రూ.1.85 లక్షల కోట్లకు చేరింది. నాన్‌ డీబీటీ (ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యా కానుక, ట్యాబ్స్‌), డీబీటీ రెండూ కలిపితే రూ.3.30 లక్షల కోట్లతో అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేయగలిగామని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇందులో కలెక్టర్ల చాలా కీలకం. ముఖ్యమంత్రికి కళ్లు, చెవులు కలెక్టర్లే. వాళ్లు బాగా పనిచేస్తే ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రతి కలెక్టర్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. 

గతంలో జరిగిన పరిపాలనకు, మన పరిపాలనకు మధ్య తేడా గమనిస్తే..
గత ప్రభుత్వంలో అధికారాన్ని ఎలా ఉపయోగించుకున్నారో మనమంతా చూశాం. ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీలు పెట్టారు. ఏ పథకం అందించాలన్నా  తమ పార్టీకి ఓటు వేశారా లేదా అని మొట్టమొదటి ప్రశ్న అడిగేవారు. ఇచ్చే అరకొరలో కూడా లంచాలు ఇవ్వకుండా ఏ పథకం కూడా ఏ ఒక్క అర్హుడికి అందే పరిస్థితి గతంలో లేదు. లంచాలు తీసుకొని ఆ అరకొర సాయాన్ని అందించే అధ్వాన్నమైన పరిస్థితిని గతంలో గమనించాం. 

ఈరోజు అలా కాకుండా వ్యవస్థలో పూర్తిగా మార్పులు తీసుకువచ్చాం. గ్రామస్థాయిలోనే గ్రామ సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థ కనిపిస్తుంది. ప్రతీ పథకం పారదర్శకంగా అమలయ్యేలా గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శిస్తున్నాం. ఎవరికైనా అర్హత ఉండి ఏ పథకమైనా అందలేదంటే.. మళ్లీ అప్లికేషన్‌ పెట్టుకునే వెసులుబాటు కల్పించాం. ఆ దరఖాస్తును రీ వెరిఫికేషన్‌ చేసి సాయం అందించే గొప్ప మనసు ఈరోజు పరిపాలనలో కనిపిస్తోంది. పార్టీలు, కులాలు, ప్రాంతాలు చూడటం లేదు.. వివక్ష ఎక్కడా చూపించే పరిస్థితి లేకుండా.. మన పార్టీకి ఓటు వేయని వారికి సైతం అర్హత ఉంటే.. సంక్షేమ పథకాలు అందించే గొప్ప కార్యక్రమం జరుగుతుంది. 

గత ప్రభుత్వ హయాంలో ఇచ్చేదే అరకొర పెన్షన్లు. ఆ రూ. వెయ్యి పెన్షన్‌ రావాలంటే మూడు నెలల పెన్షన్‌ సొమ్ము జన్మభూమి కమిటీల చేతుల్లో పెడితే తప్ప.. పెన్షన్‌ అందే పరిస్థితి గతంలో ఉండేది. ఇళ్లు మంజూరులో కూడా అదే తంతు. ఇచ్చేదే అరకొర ఇళ్లు.. ఆ ఇళ్లు మంజూరు కావాలంటే రూ.20 వేల లంచం జన్మభూమి కమిటీ చేతిలో పెడితే తప్ప ఇళ్లు మంజూరయ్యేది కాదు. సబ్సిడీతో కూడి రుణాల పరిస్థితీ అంతే. రూ.50 వేల రుణం కావాలంటే.. దానిలో రూ.20 వేలు జన్మభూమి కమిటీలకు ఇస్తే గానీ, ఆ రుణం అర్హుడికి అందే పరిస్థితి గతంలో ఉండేది. మరుగుదొడ్లు కావాలంటే లంచమే. కనీసం రూ.2 వేలు జన్మభూమి కమిటీ చేతుల్లో పెడితే తప్ప మరుగుదొడ్లు కూడా మంజూరు కాని పరిస్థితి గతంలో చూశాం. గత ప్రభుత్వ హయాంలో ఏ పథకం కావాలన్నా.. లంచం, వివక్ష ఈ రెండూ కూడా ప్రస్పుటంగా కనిపించేవి. 

ఈరోజు ఆ పరిస్థితులన్నీ మార్చగలిగాం. మంచి పరిపాలన ఈ మాదిరిగా ఇవ్వగలుగుతామని ఒక సందేశం కూడా ఇచ్చాం. కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు చూడటం లేదు. ఏ పేదవాడికి అన్యాయం జరగకూడదు. ప్రతీ పేదవాడికి మంచి జరగాలనే గొప్ప దృక్పథంతో అడుగులు పడుతున్నాయి. ఇంత పారదర్శకంగా ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే ఆరాటంతో మిస్‌ అయిన వారితో మళ్లీ అప్లికేషన్‌ పెట్టించి, వాటిని రీ వెరిఫికేషన్‌ చేయించి, వాటిని సోషల్‌ ఆడిట్‌లో పెట్టి.. అందని సంక్షేమ సాయాన్ని ప్రతి ఆరు నెలలకు విడుదల చేస్తున్నాం. ఇంత పారదర్శకంగా, మానవతాదృక్పథంతో మన ప్రభుత్వం పనిచేస్తుంటే.. ఈరోజు ఆశ్చర్యకరమైన వార్తలు.. మన మంచిని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్‌ డబ్బును పెంచుతున్నామనే వార్తను అసలు జీర్ణించుకోలేక దాని మీద కూడా అభాండాలు వేయాలనే కుట్రతో పెన్షన్‌ల మీద కట్టుకథలు రాస్తున్నారు. 

పెన్షన్లకు సంబంధించి ఈరోజు కొంతమందికి నోటీసులు వెళ్లాయి. దానిలో తప్పేముంది. ప్రతి ఆరునెలలకు ఒకసారి ప్రతి పథకానికి సంబంధించి ఒక ఆడిట్‌ జరగాలి. మన ప్రభుత్వ ఉద్దేశం అర్హులు ఏ ఒక్కరూ మిస్‌ కాకూడదు. అనర్హత ఉన్నవారికి ఏ ఒక్కరికీ రాకూడదు అనేది మన ప్రభుత్వ ఉద్దేశం. ఆరునెలలకు ఒకసారి కచ్చితంగా ఎక్కడైతే సందేహాలు ఉంటాయో దాని ప్రకారం నోటీసులు ఇస్తారు.. వాటికి రిప్లయ్‌ కూడా తీసుకుంటారు. ఆ తరువాత రీ వెరిఫై చేసిన తరువాతే ఏదైనా చర్య తీసుకుంటారు.. అలా చేయకుండా చర్య తీసుకునే అవకాశం లేదు. నోటీసులు ఇచ్చినందుకే పెన్షన్లు అన్నీ తీసేస్తున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 

పెన్షన్‌లకు సంబంధించిన విషయాలు గమనిస్తే.. గతంలో పెన్షన్లు 39 లక్షల మందికి ఇచ్చేవారు. మన ప్రభుత్వం పెన్షన్లు 62.70 లక్షల మందికి ఇస్తున్నాం. గతంలో పెన్షన్లు రూ.వెయ్యి మాత్రమే ఇచ్చేవారు. మన ప్రభుత్వంలో పెన్షన్‌ డబ్బును అక్షరాల రూ.2750కి పెంచుతున్నాం. పెన్షన్ల సంఖ్య 39 లక్షల నుంచి 62.70 లక్షలకు చేరిందంటే.. దాని అర్థం 60 శాతం గ్రోత్‌. వెయ్యి రూపాయల పెన్షన్‌ రూ.2750కి చేరిందంటే.. 175 శాతం పెరుగుదల. గతంలో పెన్షన్‌ బిల్లు నెలకు రూ. 400 కోట్లు అవుతుంటే.. మన ప్రభుత్వంలో పెన్షన్‌ బిల్లు రూ.1770 కోట్లు అవుతుంది. ఇంతగా పెరిగిన పరిస్థితుల్లో మంచి జరుగుతుందని తెలిసినప్పుడు.. అదే పనిగా అర్హులు ఎవ్వరూ మిగిలిపోకూడదని ఆరాటంతో వాళ్లతో మళ్లి అప్లికేషన్‌ పెట్టించి, రీ వెరిఫై చేసి, మళ్లీ సాయం అందిస్తున్న పరిస్థితి చూస్తున్నప్పుడు.. ఇలాంటి మానవత్వం ఉన్న ప్రభుత్వంలో ఏ పేదవాడికైనా నష్టం జరుగుతుందా అనేది ప్రతి ఒక్కరూ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయాలని కోరుతున్నాను. 

మనది మానవత్వం ఉన్న ప్రభుత్వం. పేదవాడికి దగ్గర ఉండే మనసులు మనవి. ఏ ఒక్కరికైనా అర్హత ఉండి సంక్షేమ సాయం అందని పరిస్థితి ఎక్కడా ఉండకూడదు. అర్హత ఉండి తొలగించిన పరిస్థితి అసలే ఉండకూడదు. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ బీదవారికే ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పేదవాడు కూడా అర్హత ఉండి ఈ ప్రభుత్వంలో మంచి జరగలేదనే మాట ఏ ఒక్క కలెక్టర్‌ కూడా అనిపించుకునే కార్యక్రమం చేయొద్దు. ఎందుకంటే మనం చేస్తున్న యుద్ధం ఒక పార్టీతో కాదు.. ఒక విషపు వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం. మనం ఏ మంచి చేసినా.. దాన్ని వక్రీకరించి నెగెటివ్‌గా చూపించాలనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అనే విషపు వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. మంచి చేసేవారికి ఎప్పటికీ దేవుడి ఆశీస్సులు ఉంటాయి. విషపు రాతలు, విషపు చేష్టలు, వక్రీకరణలు చేసేవారికి దేవుడే బుద్ధిచెబుతాడు. విషపు వ్యవస్థ చేసే ఏ ఆరోపణనైనా పాజిటివ్‌గా తీసుకుందాం. దాంట్లో నిజం ఉంటే దాన్ని కరెక్ట్‌ చేసుకుందాం. నిజం లేకపోతే బయటకువచ్చి వారిని తిట్టే కార్యక్రమం కూడా చేయాలని కలెక్టర్లను ఆదేశిస్తున్నాను. అలా తిట్టకపోతే వారు రాసిన అబద్ధాలు నిజం ఏమో అనే సందేహం ప్రజల్లోకి వెళ్తుంది. మనది తప్పు లేకపోతే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి గట్టిగా తిట్టండి. 

మనం ప్రజా పాలకులం. పాలకులం అంటే ప్రజాసేవకులం అని అర్థం. మన డెఫినేషన్‌లో పాలన అంటే సేవ అనేది ప్రతి కలెక్టర్‌ కూడా గుర్తుపెట్టుకోవాలి. మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. దేవుడు ఇంకా గొప్పగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ.. ఈ కార్యక్రమం ద్వారా మిగిలిపోయినవారికి మంచి జరగాలని మరోసారి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను’’ అని సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 

 

Back to Top