గిరిజ‌న ప్రాంత ఉద్యోగుల‌పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

అమ‌రావ‌తి: గిరిజ‌న ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గిరిపుత్రుల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు వంద శాతం అందించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. గిరిజ‌న ప్రాంతాల్లో మంజూరైన పోస్టుల్లో ఉద్యోగులు అక్క‌డే ప‌నిచేయాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. ఈ మేర‌కు గిరిజ‌న ప్రాంత ఉద్యోగులంతా అక్క‌డే ప‌నిచేసేలా అన్ని శాఖ‌ల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలిచ్చింది. గిరిజ‌న ప్రాంతంలో ఉద్యోగాలు పొంది ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లిన వారిని వెన‌క్కి ర‌పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులు ఆ పోస్టుల్లోనే ప‌నిచేసేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది.  ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లిన గిరిజ‌న ప్రాంత అధికారుల జాబితా 24 గంట‌ల్లో సిద్ధం చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. గిరిజ‌న  ప్రాంతంలో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు మెరుగుప‌రిచేందుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై గిరిజ‌న ప్రాంతాల్లో అధికారుల కొర‌త లేకుండా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది.

Back to Top