పంటు, ట్రాక్ట‌ర్‌పై వ‌ర‌ద బాధితుల వ‌ద్ద‌కు..

భారీ వ‌ర్షంలోనూ గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శిస్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

కోన‌సీమ‌: వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాకు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. పంటుపై గోదావ‌రి న‌ది నుంచి లంక గ్రామాల‌కు చేరుకున్నారు. భారీ వ‌ర్షం కురుస్తున్న‌ప్ప‌టికీ.. వ‌ర‌ద బాధితులను ప‌రామ‌ర్శించేందుకు ట్రాక్ట‌ర్‌పై బ‌య‌ల్డేరిన సీఎం.. వ‌ర‌ద క‌లిగించిన న‌ష్టాన్ని ప‌రిశీలిస్తూ ముందుకుసాగారు. అనంత‌రం లంక గ్రామాల‌కు చేరుకొని బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. వారి క‌ష్టాల‌ను, వ‌ర‌ద మిగిల్చిన న‌ష్టాల‌ను అడిగి తెలుసుకున్నారు. ప్ర‌భుత్వ స‌హాయ‌క కార్య‌క్ర‌మాల గురించి ఆరా తీశారు. ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని అంద‌రినీ ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని బాధితుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా ఇచ్చారు. బాధితుల నుంచి విన‌తిప‌త్రాల‌ను స్వీక‌రించారు. 

తాజా వీడియోలు

Back to Top