సీఎం వైయస్‌ జగన్ దిగ్ర్భాంతి

కాసేపట్లో విశాఖకు ముఖ్యమంత్రి
 

తాడేపల్లి: విశాఖపట్నం జిల్లా పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జి పాలిమర్స్‌లో రసాయన వాయువు లీకేజీ అయిన విషయం తెలిసిన వెంటనే సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.  ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందగా, 200 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఎం వైయస్‌ జగన్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో సీఎం వైయస్‌ జగన్‌ విశాఖకు బయలుదేరుతున్నారు. గ్యాస్‌ లీకేజీ జరిగిన ప్రాంతానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లనున్నారు. పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలను సమీక్షించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు.  
 

Back to Top