రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైయస్‌ జగన్‌

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు జలశక్తి మంత్రితో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ కానున్నారు. అంతేకాకుండా గనుల శాఖ మంత్రిని కూడా సీఎం వైయస్‌ జగన్‌ కలిసే అవకాశం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై కేంద్రమంత్రులతో సీఎం వైయస్ ‌జగన్‌ చర్చించనున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి వివరించారు. 

Back to Top