ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం వైయస్‌ జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌

తాడేపల్లి: ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. బదిలీల ప్రక్రియ ఆన్‌లైన్‌ పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రిని, ఉన్నతాధికారులను ఆదేశించారు. పదో తరగతి ప‌రీక్ష‌లు పూర్తయిన తరువాత ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని సూచించారు. బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ పద్ధతిలోనే నిర్వహించాలని సీఎం ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలని, గిరిజన ప్రాంతాల్లో కూడా టీచర్ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 

తాజా ఫోటోలు

Back to Top