పోలీసు అమరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

 విజ‌య‌వాడ‌:  ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరుల కుటుంబాలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెక్కుల పంపిణీ చేశారు. విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ స‌భ‌కు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు స్టేడియం చేరుకుని.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత అమరులైన పోలీసులకు సీఎం వైఎస్‌ జగన్‌, హోంమంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర సెక్రటరీ నివాళులు అర్పించారు. కాగా,  2017 నుంచి పెండింగ్‌లో ఉ‍న్న పోలీసు సంక్షేమ గ్రాంట్‌ను అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లగానే 15 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేశారు.  దీంతో దాదాపు 206 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఆ తర్వాత  కోవిడ్‌ విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల చెక్కును సీఎం వైయ‌స్‌ జగన్‌ అందజేశారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top