రాష్ట్రపతి కోవింద్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ వీడ్కోలు

 చిత్తూరు : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏపీ పర్యటన ముగిసింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఆయన ఈ సోమవారం ఢిల్లీ తిరుగు ప్రయాణమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతి కోవింద్‌కు వీడ్కోలు పలికారు. సీఎం జగన్‌తో పాటు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ఇతర ప్రముఖులు  ఉదయం పదిగంటల ప్రాంతంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుని రాష్ట్రపతిని సాగనంపారు. అనంతరం సీఎం జగన్‌ 10.30 గంటలకు రేణిగుంట విమానా శ్రయం నుంచి గన్నవరం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ మధ్యాహ్నం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొంటారు.

తాజా ఫోటోలు

Back to Top