ప్ర‌జ‌లంద‌రికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు 

తాడేప‌ల్లి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలంద‌రికీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్ర‌జ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలుపుతూ సీఎం కార్యాల‌యం ఓ ప‌త్రికా ప్రకటన విడుదల చేసింది. ‘పొట్టి శ్రీరాములుతో పాటు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు ఎంతగానో ప్రేరేపింపజేస్తున్నాయి. మహానుభావుల త్యాగాలను మననం చేసుకుంటూ.. వారిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం మనమంతా అంకితభావం, నిబద్ధతతో ముందుకువెళ్దాం’ అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top