అనంత ఘ‌ట‌న‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దిగ్ర్భాంతి

అనంతపురం: ఏపీ- కర్నాటక సరిహద్దుల్లో విషాదం చోటు చేసుకుంది. అనంతపురం రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్‌ మండలం దర్గహొన్నూర్‌లో బుధవారం ఘోరం జరిగింది. ట్రాక్టర్‌పై విద్యుత్‌ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్ర‌క‌టించారు. ఒక్కొ మృతురాలి కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందిస్తామ‌ని చెప్పారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top