తెలుగువారంద‌రికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు

తాడేప‌ల్లి: ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు సీఎం ట్వీట్ చేశారు. ``చీక‌టిపై వెలుగు, చెడుపై మంచి విజ‌యానికి ప్ర‌తీక దీపావ‌ళి. ఈ పండుగ మీ అంద‌రి ఇంట ఆనంద‌పు కాంతులు నింపాల‌ని, సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు`` అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top