దేవినేని అవినాష్ ఇంటికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

విజ‌య‌వాడ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌య‌వాడ ఈస్ట్ స‌మ‌న్వ‌య‌క‌ర్త దేవినేని అవినాష్ ఇంటికి ముఖ్య‌మంత్రి, పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెళ్లారు. విజయవాడలో హయత్‌ ప్లేస్‌ హోటల్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం వైయ‌స్‌ జగన్‌ను గుణదలలోని తమ నివాసానికి రావాల్సిందిగా విజయవాడ ఈస్ట్ వైయ‌స్‌ఆర్‌సీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్‌ కోరడంతో ముఖ్యమంత్రి ఆయన నివాసానికి వెళ్ళారు. అవినాష్‌ కుటుంబ సభ్యులతో ముచ్చటించిన అనంతరం అక్కడి నుంచి బయల్దేరి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఈస్ట్‌ నియోజకవర్గంలో వైయ‌స్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు సీఎంకు ఘన స్వాగతం పలికారు.

Back to Top