నేడు ఢిల్లీకి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లి.. అక్కడి నుంచి ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి బయ‌ల్దేర‌తారు. రాత్రి 8.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి జనపథ్‌ 1లోని ముఖ్యమంత్రి నివాసంలో బ‌స చేస్తారు. రేపు మ‌ధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ భేటీ కానున్నారు. ఏపీ అభివృద్ధికి రావాల్సిన నిధులతో పాటు పోలవరం, విభజన హామీల గురించి ప్రధానితో సీఎం చర్చించ‌నున్నారు. 

Back to Top