బ్యాట్‌ పట్టిన సీఎం వైయస్‌ జగన్‌

వైయస్‌ రాజారెడ్డి స్టేడియంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వైయస్‌ఆర్‌ జిల్లా:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బ్యాట్‌ పట్టి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. వైయస్‌ఆర్‌ జిల్లా పర్యటన  రెండో రోజు కడప నగరంలో సాగింది. పట్టణంలోని వైయస్‌ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో సీఎం వైయస్‌ జగన్‌ బ్యాటింగ్‌ చేసి అభిమానులను అలరించారు. అనంతరం క్రీడాకారులతో మాట్లాడారు. అంతకుముందు డై అండ్‌ నైట్‌ మ్యాచ్‌ల కోసం రూ.4 కోట్లతో  ఫ్లడ్‌ లైటింగ్‌ ఏర్పాటు పనులను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. అలాగే దివంగత నేత వైయస్‌ రాజారెడ్డి, మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిల విగ్రహాలను సీఎం వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top