అభినందించాల్సింది పోయి అసత్యాలు చెబుతారా

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
 

అమరావతి: రైతులను ఆదుకునేందుకు వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం ప్రవేశపెడితే..ప్రతిపక్షం అభినందించాల్సింది పోయి అసత్యాలు చెబుతారా అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. సున్నా వడ్డీ పథకం టీడీపీ ప్రభుత్వం కూడా అమలు చేసిందని ఆ పార్టీ ఎమ్మెల్యే రామనాయుడు అబద్ధాలు చెప్పడం పట్ల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఖండించారు. రికార్డులు చెప్పించి వాస్తవాలు సీఎం సభ దృష్టికి తెచ్చారు.  రూ.76, 721 కోట్ల రుణాలు ఇస్తే రైతులకు సున్నా వడ్డీ అందుబాటులోకి వస్తుంది. చంద్రబాబు అధికారంలో ఉన్న ఏ రోజు కూడా సున్నా వడ్డీ రుణాలు ఇవ్వలేదు.  కేటాయింపులు ఉన్నాయి కానీ,ఖర్చు లేదని ఏ బడ్జెట్‌లో కూడా ఇదే కనిపించింది. వడ్డీల రూపంలోనే రైతులు రూ.3068 కోట్లు బ్యాంకులకు చెల్లించారు. టీడీపీ ప్రభుత్వం ఏ రోజు కూడా సున్నా వడ్డీలు చెల్లించలేదు. మాది రైతు ప్రభుత్వం కాబట్టే రైతుల కోసం వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం ప్రవేశపెట్టాం. దీన్ని అభినందించాల్సింది పోయి ప్రతిపక్షం సత్య దూరమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని సీఎం పేర్కొన్నారు.
 

Back to Top