అధ్యక్ష స్థానంలో నా సోదరి కూర్చోవడం చాలా సంతోషం

మండలిలో సీఎం వైయస్‌ జగన్‌ 

అమరావతి: శాసన మండలి అధ్యక్ష స్థానంలో నా సోదరి జకియా ఖానమ్‌ కూర్చోవడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శాసన మండలి చైర్‌పర్సన్‌గా జకియా ఖానమ్‌ ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆమెను సీఎం వైయస్‌ జగన్‌ సాదరంగా తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం మండలిలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు.

 ఈ రోజు అధ్యక్ష అని సంభోదించే స్థానంలో నా అక్క జకియా ఖానమ్మ ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఒక సాధారణ కుటుంబం నుంచి గృహిణిగా చట్టసభలో అడుగుపెట్టడమే కాకుండా ఈ రోజు డిప్యూటీ వైస్‌ చైర్‌పర్సన్‌గా కూర్చోవడం మహిళలకు, మైనారిటీలకు శుభ సంకేతం. ఆడవాళ్లు అన్ని రకాలుగా పైకి రావాలి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలని మన ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లుగా కృషి చేస్తోంది. అందులో భాగంగా ఈ రోజు దేవుడు నాకు అదృష్టం కల్పించినందుకు సంతోషపడుతున్నాను. మనసారా హృదయపూర్వకంగా మంచి జరగాలని కోరుకుంటూ సీఎం వైయస్‌ జగన్‌ సెలవు తీసుకున్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top