కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించిన సీఎం

విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్‌లో లీకైన విషపూరిత వాయువును పీల్చుకొని విశాఖ కేజీహెచ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి సీఎం వైయస్‌ జగన్‌ నేరుగా కేజీహెచ్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో మాస్క్‌ ధరించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనపై బాధితులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. సీఎం వైయస్‌ జగన్‌ వెంట డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌ ఉన్నారు. 

Back to Top