జనార్ధనరెడ్డిని పరామర్శించిన సీఎం వైయస్‌ జగన్‌

పులివెందుల: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పులివెందుల నియోజకవర్గం వేముల మండలం నల్లచెరువుపల్లె గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు రామగిరి జనార్ధనరెడ్డిని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. జనార్ధనరెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక వాహనంలో పులివెందులలోని హెలిప్యాడ్‌ వద్దకు తీసుకువచ్చారు. వాహ‌నంలో కూర్చున్న‌ జ‌నార్ధ‌న్‌రెడ్డి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన సీఎం.. అత‌ని ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 

Back to Top