తాడేపల్లి: చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతం కావడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకోవడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేస్తూ..ఇది దేశం గర్వించదగిన మరియు ప్రతిష్టాత్మకమైన క్షణం అని అభివర్ణించారు. భారత కాలమానం ప్రకారం.. ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5.44కి ల్యాండింగ్ ప్రక్రియ మొదలయ్యింది. ఇప్పటివరకూ అన్ని దశలనూ సవ్యంగా పూర్తిచేసుకున్న చంద్రయాన్-3 .. దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడిపై కాలుమోపడంతో ప్రక్రియ పూర్తయ్యింది. జాబిల్లిపై అదీ దక్షిణ ధ్రువంలో కాలు మోపడంతో.. చంద్రయాన్3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రయాన్-2 ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్న పాఠంతో.. అలాంటి తప్పిదాలు లేకుంటే చంద్రయాన్-3ని పక్కాగా రూపొందించినట్లు ధీమా వ్యక్తం చేసిన ఇస్రో చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏ దేశం చంద్రుడిపై దక్షిణ ధ్రువంవైపు ల్యాండ్ కాలేదు. భారత్ ఆ ఘనత సాధించి చరిత్ర సృష్టిచింది.