పీవీ సింధుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

తాడేప‌ల్లి: ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ తరఫున మహిళల వ్యక్తిగత విభాగంలో వరుసగా రెండు పతకాలు సాధించి నూత‌న‌ అధ్యాయం లిఖించిన బ్యాడ్మింటన్‌ స్టార్‌, తెలుగుతేజం పీవీ సింధుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధును సీఎం వైయ‌స్‌ జగన్‌ అభినందించారు. ఒలింపిక్స్‌ వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళ అంటూ ట్విట్టర్‌లో సీఎం వైయ‌స్‌ జగన్‌ కొనియాడారు. భవిష్యత్‌లో సింధు మ‌రిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top