తాడేపల్లి: సీజేఐగా బాధ్యతలను స్వీకరించిన జస్టిస్ ఎన్వీ రమణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత సర్వోన్నత న్యాయస్థానం 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను చేపట్టినందుకు శుభాకాంక్షలు అని సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పదవీ బాధ్యతలను స్వీకరించారు. భారత రాష్ట్రపతి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీతో పాటు అతి కొద్ది మంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.