తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హ‌ర్షం

తాడేపల్లి: 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు జెండా రెపరెపలాడిందని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రావటంపై సీఎం వైయ‌స్‌ జగన్  హర్షం వ్యక్తం చేశారు. జాతీయ ఉత్త‌మ న‌టుడిగా ఎంపికైన అల్లు అర్జున్‌కు, ఉత్త‌మ చిత్రంగా అవార్డు గెలుచుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు, పుష్ప సినిమాతో ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడి అవార్డు గెలుచుకున్న దేవిశ్రీ‌ప్ర‌సాద్‌కు, ఉత్తమ పాట‌ల ర‌చ‌యిత‌గా (కొండ పొలం) జాతీయ అవార్డు గెలుచుకున్న చంద్ర‌బోస్‌కు  సీఎం వైయ‌స్ జగన్ అభినందనలు తెలిపారు. 69వ జాతీయ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమకు బొనాంజాగా నిలిచాయని పేర్కొన్నారు. జాతీయ అవార్డులు గెలుచుకున్న వారంతా తెలుగు ప్ర‌జ‌లందరినీ  గర్వించేలా చేశార‌న్నారు. 

https://twitter.com/ysjagan/status/1694723574526095546?s=20

తాజా వీడియోలు

Back to Top