మోషేన్‌రాజును చైర్మన్‌స్థానంలో కూర్చోబెట్టడం సంతోషంగా ఉంది

పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ.. పదేళ్లుగా నాతో ప్రయాణం

శాసన మండలిలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అసెంబ్లీ: సామాన్య దళిత రైతు కుటుంబంలో పుట్టి.. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి.. నేడు శాసనమండలి చైర్మన్‌గా కొయ్యే మోషేన్‌రాజు ఎన్నికవ్వడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మండలి చైర్మన్‌గా ఎన్నికైనా మోషేన్‌రాజుకు సీఎం వైయస్‌ జగన్‌ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. శాసనమండలిలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. చిన్న వయసులోనే (20 సంవత్సరాలకే) మోషేన్‌రాజు భీమవరం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికై.. అప్పటి నుంచి నాలుగుసార్లు మున్సిపల్‌ కౌన్సిలర్‌గా, ఫ్లోర్‌ లీడర్‌గా అంచెలంచెలుగా ఎదిగారన్నారు. ‘నాన్న ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. వైయస్‌ఆర్‌ సీపీ స్థాపించిన తొలి రోజుల్లో మోషేన్‌ రాజు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా పార్టీ తరఫున క్రియాశీలకంగా పనిచేశారు’ అని సీఎం గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి తనతో పదేళ్ల పాటు ప్రయాణం చేశారని, మోషేన్‌రాజును ఈరోజు మండలి చైర్మన్‌ స్థానంలో కూర్చోబెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. 
 

Back to Top