జస్టిస్‌ జయచంద్రారెడ్డి మృతిపై సీఎం దిగ్భ్రాంతి

తాడేపల్లి: సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కామిరెడ్డి జయచంద్రారెడ్డి మృతిపై  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లా కమిషన్‌ చైర్మన్‌గా, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌గా భారత న్యాయవ్యవస్థకు జయచంద్రారెడ్డి చేసిన కృషి మరువలేనిదని సీఎం గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం వైయస్‌ జగన్‌ త‌న ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశారు.

Back to Top