బీపీఆర్‌ విఠల్‌ మృతికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

హైదరాబాద్‌ : మాజీ ఐఏఎస్‌ అధికారి, ప్రముఖ ఆర్థికవేత్త బీపీఆర్‌ విఠల్ (93) మృతి పట్ల ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  సంతాపం తెలిపారు. బీపీఆర్‌ విఠల్‌ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన కుటుంబసభ్యులకు ‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో అతి ఎక్కువ కాలం పాటు ఆర్థిక, ప్రణాళిక శాఖల కార్యదర్శిగా, ఏపీ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డు వైస్ చైర్మన్‌గా, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సలహాదారుడిగా, పదవ ఆర్థిక కమిషన్ సభ్యుడిగా విఠల్ అందించిన సేవలను  గుర్తుచేసుకున్నారు. 

Back to Top