మ‌ళ్లీ చ‌ర్చ జ‌ర‌పాల‌ని ప్ర‌తిప‌క్షం కోర‌డం స‌రికాదు

వైయ‌స్ జ‌గ‌న్ 

 
అమ‌రావ‌తి: ప‌ంచాయ‌తీ రాజ్ చ‌ట్ట స‌వ‌ర‌ణ 2020 బిల్లుపై ఇదివ‌ర‌కే స‌భ‌లో సుదీర్ఘంగా చ‌ర్చ జ‌రిగింద‌ని, మ‌ళ్లీ చ‌ర్చ జ‌ర‌పాల‌ని ప్ర‌తిపక్షం కోర‌డం స‌రికాద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపేర్కొన్నారు. పంచాయ‌తీ రాజ్ బిల్లుపై ప్ర‌తిప‌క్ష స‌భ్యుల  అభ్యంత‌రంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స్పందించారు. ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు సంబంధించిన ఇంత‌కు ముందే చ‌ర్చ జ‌రిగింది. ఇది కౌన్సిల్‌కు వెళ్లింది. ఆ త‌రువాత వాళ్లు వెన‌క్కి పంపించారు. 151 మంది ఉన్న ఇదే స‌భ‌లో చ‌ర్చించాం. దాన్నే మ‌ళ్లీ ఇవాళ ఆమోదం తెలుపుతున్నాం. ఇవాళ కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టేంది లేదు. అంత కొత్త‌గా జ‌రుగుతున్న‌ట్లు ప్ర‌తిప‌క్షం అభ్యంత‌రం తెలుపుతోంది. త్వ‌రిత‌గ‌తిన ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని గ‌తంలోనే ఇదే స‌భ‌లో చ‌ర్చ జ‌రిగింది. ఇప్పుడు ఫార్మాలిటీగా స‌భ‌కు బిల్లు వ‌చ్చింది. దీనిపై కొత్త‌గా చ‌ర్చ జ‌ర‌గాల‌ని ప్ర‌తిప‌క్షం చెప్ప‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. 

పంచాయ‌తీ రాజ్ చ‌ట్ట ‌స‌వ‌ర‌ణ బిల్లు ఆమోదం ‌

అమ‌రావ‌తి: పంచాయ‌తీ రాజ్ చ‌ట్ట ‌స‌వ‌ర‌ణ 2020 బిల్లు ఆమోదానికి మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స‌భ‌లో ప్ర‌తిపాద‌న‌లు ప్ర‌వేశ‌పెట్టారు. గ‌తంలో ఇదే బిల్లుపై అసెంబ్లీలో చ‌ర్చించి శాస‌న మండ‌లికి పంపించారు. అక్క‌డ కొన్ని స‌వ‌ర‌ణ‌లు చేసి మళ్లీ స‌భ‌కు పంపించారు. స‌భ‌లో మ‌రోసారి మంత్రి ఈ బిల్లు ఆమోదానికి ప్ర‌తిపాద‌న‌లు ప్ర‌వేశ‌పెట్ట‌డంతో స‌భ్యులు ఆమోదం తెలిపారు. ఈ బిల్లును పాస్ చేస్తూ మంత్రి ఆమోదం తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top