ప్రజా సంక్షేమమే పరమావధిగా వైయ‌స్ జగన్ పాలన 

వైయ‌స్ జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి

తిరుప‌తిలో  20వేల మందితో భారీ ర్యాలీ

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. వంద కిలోల కేక్‌ను ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కట్‌ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే భూమన ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. 20 వేల మందితో కృష్ణాపురం ఠాణా నుంచి తుడా కార్యాలయం వరకు భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా వైయ‌స్‌ జగన్ పాలన సాగుతోందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను  యువత ప్లకార్డులతో ప్రదర్శించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, యువత పాల్గొన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top