50 రోజులైనా అసెంబ్లీ నిర్వహణకు సిద్ధం

బీఏసీ సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌
 

అమరావతి: అసెంబ్లీ సమావేశాలు 50 రోజులైన నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైనయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. బీఏసీ సమావేశంలో సీఎం మాట్లాడారు. 3.98 కోట్ల మందికి వివిధ పథకాల ద్వారా రూ.42 వేల కోట్లు బదిలీ చేశామన్నారు.  మేం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. బయట పరిస్థితులు అందరికి తెలుసు అన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీ నడపాలని టీడీపీ కోరితే మాకు అభ్యంతరం లేదన్నారు.  ఎన్ని రోజులు నడపాలో మీరు అడగండి..నిర్వహిస్తామని సీఎం ప్రతిపక్షానికి సూచించారు. కాకపోతే వర్చువల్‌ అసెంబ్లీ సాధ్యం కాదన్నారు. దీనిపై పార్లమెంట్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సమావేశాలు పెడతామన్నారు.సీఎం ప్రకటనతో ప్రతిపక్ష సభ్యులు మౌనంగా ఉండిపోయారు.
 

Back to Top