ఈసీ గంగిరెడ్డికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళులు

ఈసీ గంగిరెడ్డి  సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న వైయ‌స్ కుటుంబ స‌భ్యులు  
 

వైయ‌స్ఆర్ జిల్లా:  దివంగత డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతి ఆదివారం పులివెందులలో నిర్వహించారు. డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైయ‌స్సార్‌ సమాధుల తోటలో ఉన్న డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ఘాట్‌ వద్ద ఆదివారం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సతీమణి వైయ‌స్‌ భారతిరెడ్డి, వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైయ‌స్‌ విజయమ్మ, దివంగత వైయ‌స్‌ జార్జిరెడ్డి సతీమణి వైయ‌స్‌ భారతమ్మ, ఇతర వైయ‌స్‌ కుటుంబీకులు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భాకరాపురంలోని వైయ‌స్సార్‌ ఆడిటోరియంలో ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. సంస్మరణ సభ అనంతరం మరపురాని జ్ఞాపకం డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సభకు వైయ‌స్‌ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top