క్రిస్టినా కుమారుడి వివాహానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హాజ‌రు

మంగ‌ళ‌గిరి: గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా కుమారుడి వివాహా వేడుకకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వివాహా వేడుకలో పాల్గొని వరుడు డేవిడ్‌ యశ్వంత్, వధువు అష్లీ బ్యానీలను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వదించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట హోంమంత్రి తానేటి వ‌నిత, రాజ్య‌స‌భ స‌భ్యులు మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top