దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభకు సీఎం హాజరు

నెల్లూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో సీఎం వైయస్‌ జగన్‌ పాల్గొన్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరు చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గొలగమూడి వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ చేరుకున్నారు. సంస్మరణ సభకు హాజరైన సీఎం వైయస్‌ జగన్‌.. గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం వైయస్‌ జగన్‌ ఓదార్చారు. ఈ స‌భ‌కు మేక‌పాటి కుటుంబ స‌భ్యుల‌తో పాటు మంత్రులు, వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇత‌ర నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top