ఇఫ్తార్‌ విందుకు హాజ‌రైన‌ సీఎం వైయ‌స్‌ జగన్ 

 విజ‌య‌వాడ‌: న‌గ‌రంలోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల్గొన్నారు. అంత‌కుముందు  విజయవాడలోని వించిపేటలో షాజహూర్‌ ముసాఫిర్‌ ఖానాను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.14కోట్లతో నిర్మాణాన్ని పూర్తి చేసింది. ముస్లింల శుభకార్యాలయాలకు అనువుగా దీనిని తీర్చిదిద్దారు. విందుకు ముందు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను ముస్లిం నాయ‌కులు స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ముస్లింల‌కు రంజాన్ ముంద‌స్తు శుభాకాంక్ష‌లు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top